దివంగత సినీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వి కపూర్ 'ధకడ్' అనే బాలీవుడ్ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన నటనతో , అందచందాలతో మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గోస్ట్ స్టోరీస్,  గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి పలు చిత్రాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది .

ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నయనతార తమిళ్ లో నటించిన కొలమావు కోకిల అనే సినిమాకు అధికార రీమేక్. ఈ సినిమాను తెలుగులో కోకోకోకిల అనే పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా ప్రముఖ 'ఓ టి టి' లలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 29 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వి కపూర్ మాట్లాడుతూ తన భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ... నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నిజంగా చాలా ప్రతిభావంతుడై  ఉండాలి.

అలాగే తన గోల్స్‌పై చాలా ఇష్టం కలిగి ఉండాలి. అతనితో ఉన్నప్పుడు నాకు చాలా ఉత్సాహం రావాలి. అతని నుంచి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా అతనికి కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు అతనికి నేనంటే పడి చచ్చిపోయే అంత ప్రేమ ఉండాలి అని తాజా ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: