తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ సినిమాలు చేసే హీరోలకే ఎక్కువగా ఫాలోయింగ్ నెలకొంటూ ఉంటుంది. కెరీర్ మొదట్లో చాలామంది ప్రేమ కథ సినిమాలను చేసిన కూడా ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న చాలా మంది మాస్ సినిమాలను చేసి భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారే ఆ విధంగా అక్కినేని నాగచైతన్య ఈ తరహా సినిమాలు చేయకపోవడం ఆయన అభిమానులను కొంత కలవర పరుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ సాఫ్ట్ కథలు ప్రేమ కథ సినిమాలను చేస్తారని ఆయనను ప్రశ్నిస్తున్నారు అక్కినేని అభిమానులు.

ఆయన కెరియర్ లోని మొదటి సినిమానే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా చేశాడు అలా జోష్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత మాస్ సినిమాల కోసం ప్రయత్నించి బంగపడ్డారు అందుకేనేమో ఆయన మళ్ళీ మాస్ సినిమాల జోలికి వెళ్లడం లేదు. మొదటినుంచి ఆయనకు హిట్స్ తెచ్చి పెట్టిన ప్రేమ కథ సినిమాలనే నమ్ముకుని చేస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఆయన కెరియర్ బాగానే కొనసాగుతుంది. 

అయితే తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకునిపోవాలంటే తప్పకుండా మాస్ సినిమాలు చేసి తీరాల్సిందే. అలాంటి హీరోలకే భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంది. ఈ నేపథ్యంలో హీరో వచ్చే సినిమాలతో నైనా మాస్ చిత్రాలతో అలరించాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం థాంక్యు అనే వెరైటీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. జూలై 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వీరి కాంబో లో దూత అనే వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. మరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్న నాగచైతన్య ఆ తర్వాత మాస్ దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: