ఇక గత కొంత కాలంగా కూడా కరోనా మహమ్మారి కారణంగా సినిమాలు చాలా వరకు కూడా అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. షూటింగ్ లు నిలిచి పోవడంతో నిర్మాతలకు నిర్మాణ భారం కూడా బాగా పెరిగిపోయింది.ఇంకా అలాగే దీనికి తోడు థియేటర్లు కూడా తెరుచుకోక పోవడంతో చాలా వరకు సినిమాలని ఓటీటీలకు ఇచ్చేశారు. అయితే ఇప్పడు అదే ఓటీటీలు థియేటర్ వ్యవస్థని బాగా ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. అంతే కాకుండా తాజాగా నిర్మాణ వ్యయం అనేది పెరగడం టికెట్ రేట్లు పెంచడంతో సగటు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో చాలా వరకు కూడా సినిమాలు నష్టాల బాట పట్టాయి.ఇక రెండు మూడు వారాల తరువాత ఓటీటీలో సినిమాలు చూడొచ్చులే అనే మైండ్ సెట్ కి ఆడియన్ రావడంతో చాలా వరకు సిరిమాలు రెండు వారాలకు మించి థియేటర్లలో నిలబడలేని పరిస్థితులు చాలా ఎక్కువగా ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పెంచిన టికెట్ రేట్లే. 


ఇంకా అలాగే దీనితో పాటు ఓటీటీలకు సినిమాలని ఎన్నివారాల తరువాత ఇవవ్వాలనే దానిపై చాలా రోజులుగా తర్జన బర్జన పడుతున్నారు నిర్మాతలు. తాజాగా మళ్ళీ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా సినిమాల ఫలితాల వస్తున్న నష్టాల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేశారు. ఇక నుంచి సినిమాలు విడుదల చెయ్యడానికి వారు ముందుకు రావట్లేదు. అందుచేత నిర్మాతలకు వేరే దారి లేక తప్పక వారి సొంతంగా సినిమాలని రిలీజ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ నెల 26 వ తేదీన కూడా ప్రధాన నాలుగు విభాగాలు నిర్మాతలు పంపిణీ దారులు ఎగ్జిబిటర్లు స్టూడియో నిర్వాహకులు ప్రత్యేకంగా సమావేశం కానుట్టుగా సమాచారం తెలిసింది.ఇక ఈ నేపథ్యంలో వారు తీసుకోబోతున్న నిర్ణయాలు తాజాగా బయటికి వచ్చాయి.ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు నివరధికంగా నిలిపివేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: