నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 107వ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యే స్థాయికి వచ్చింది. దసరా కానుకగా విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసింది యూనిట్ కానీ సమయం తక్కువగా ఉండటంతో ఆలోపు సినిమాను పూర్తి చేయలేమని భావించి విడుదల తేదీని మార్చాలన్న ఆలోచనలో ఉంది. ఆ విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఊర మాస్ మసాలా సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాను మొదలుపెట్టి పూర్తయ్యే స్థాయికి వచ్చినా కూడా టైటిల్ ను నిర్ణయించడంలో చిత్ర బృందం రోజురోజుకు ఆలస్యం చేయడం నందమూరి అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. పలు ఆసక్తికరమైన టైటిల్స్ నిర్ణయించినా కూడా ఈ సినిమా టైటిల్ ను నిర్ణయించడం వెనక మరింత ఆలస్యం చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

తాజాగా వినిపిస్తున్న వార్తలు ప్రకారం ఈ చిత్రం యొక్క టైటిల్ ను నిర్ణయించడానికి రంగం సిద్ధం చేసిందట. త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. అధికారికంగా కూడా దీనికి సంబంధించిన ప్రకటనను ఇవ్వబోతున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రానికి టైటిల్ సగం విజయాన్ని తీసుకు వస్తుంది కాబట్టి ఈ చిత్రం ఏ విధమైన టైటిల్ ను నిర్ణయించారో చూడాలి. ఊర మాస్ చిత్రాలను చేసే దర్శకుడైన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని బాలయ్య అభిమానులకు వారి రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా చేశాడని అంటున్నారు. మరి బాలయ్య తన సక్సెస్ జోష్ ను ఈ సినిమా తో కంటిన్యూ చేస్తూ మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: