ప్రస్తుత కాలంలో సినిమా షూటింగులు బాగానే జరుగుతూ ఉన్నాయి. అయితే హీరో హీరోయిన్లకు ఇతర సినిమాల బృందానికి తప్పనిసరిగా కేరవాన్ అనే సదుపాయాన్ని కల్పిస్తూ ఉంటారు నిర్మాతలు. ఇకపోతే స్టార్ సెలబ్రెటీలు అయితే సొంతంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి ఇష్టాలకు అనుగుణంగా వాటిని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ నటీనటులు సైతం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కేరవాన్ లు తీసుకున్నారు ఈ కేంద్రంలోని మెగా డాక్టర్ నిహారిక సైతం తనకు ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం.


నిహారిక కూడా కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెరకు బాగా సుపరిచితురాలు అయింది ఆ తర్వాత హీరోయిన్గా వెండి తెరపై కూడా నటించారు అయితే వెండి ధరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక తర్వాత పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ నిర్మాతగా మారడం జరిగింది. నిహారిక షూటింగ్ లొకేషన్లో ఉన్నారంటే చాలు తప్పనిసరిగా ఆమెకు కేరవాన్ కచ్చితంగా ఉండాల్సిందేనట.. అయితే తాజాగా తన కేరవాన్ గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. తన కేరవాన్ లో తప్పనిసరిగా ఉండవలసిన ఒక వస్తువు గురించి ఆమె తెలియజేసింది.
నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది అయితే వీరి వివాహమైన తర్వాత చైతన్య నిహారికకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ గా బజ్ అనే ఒక కుక్క పిల్ల ఇచ్చారట. ఇక అదంటే నిహారికకు చాలా ఇష్టమట ఇకపోతే తన భర్త చైతన్య తో ఆ కుక్క పిల్ల తో కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్నట్లు తెలియజేసింది. అయితే తన కేరవాన్ లో ఆ ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని నిహారిక ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం నిహారిక హలో వరల్డ్ అని వెబ్ సిరీస్ ను నిర్మించింది త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: