డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ  సినిమా ఫుల్ రన్ లో అదిరిపోయే లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.సిద్దు టైమింగ్ కు నేహా అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సిద్దు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు సీక్వెల్ పై ఆసక్తికి పెరిగింది. రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చిన వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ కు సర్వం సిద్ధం అయ్యింది. అయితే ఈ సీక్వెల్ లో వేరే హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది.ఈ డీజే టిల్లు సీక్వెల్ లో నేహా శెట్టికి బదులు మరో హీరోయిన్ నటించనుందని సమాచారం తెలుస్తోంది.


 ఇందుకోసం యంగ్ బ్యూటీ బ్యూటీ శ్రీలీల ను ఎంపిక చేశారని తెలుస్తోంది. పెళ్లి సందడి తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీలీల. తన అందం, చలాకీ తనంతో ఆకట్టుకుంది. ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస లను అందుకుంటుంది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాలో ఈ అమ్మడు చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డీజే టిల్లు టీమ్ కు శ్రీలీల షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. డీజే టిల్లు సీక్వెల్ ఒప్పుకున్నా శ్రీలీల ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత శ్రీలీల సినిమా నుంచి తప్పుకుందట. అయితే ఇందుకు కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: