తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్యామల అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. ఇక ఈమె అప్పుడప్పుడు పలు ఈవెంట్లకు సినీ ఫంక్షన్లకు హోస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఇక గడిచిన కొద్దిరోజుల క్రింద సినీ ఈవెంట్ లో ఆర్జీవి కళ్ళకు చిక్కి ఈమె మరింత పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత పెరిగిందని చెప్పవచ్చు. పెళ్లి సమయంలో ఒక కోరిక ఉండేదట ఆ కోరికను ఇప్పుడు నెరవేర్చుకున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.


యాంకర్ శ్యామల హంస పల్లకిపై అలా వస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని చెప్పవచ్చు.ఆమె హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన టైం బాగాలేక కేవలం బుల్లితెర పైన ఉండిపోయింది. కాని కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఏదైనా సినిమాల్లో చిన్న పాత్రలలో కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా హంస పల్లకిపై వస్తుంటే ఆమెను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.. అయితే శ్యామలకి ఎప్పటినుంచో ఒక కోరిక ఉన్నదట. యాక్టర్ నరసింహారెడ్డిని ఈమె వివాహం చేసుకుంది. అయితే ఈమెది లవ్ మ్యారేజ్ కనుక పెళ్లి సమయంలో ఈమె పెళ్లికూతురుగా ముస్తాబయి పల్లకిలో వెళ్లాలని ఆమె కోరిక ఉన్నదట.


అయితే పెళ్లి సమయంలో  ఆ కోరిక నెరవేరలేదట. కానీ తాజాగా తన మనసులోని కోరికను ఇప్పుడు తీర్చుకుంది. ఈ ముద్దుగుమ్మ హంస వాహనం డిజైన్ లో ఉన్న ఒక పల్లకిలో కూర్చొని యువరాణిలా ఊరేగింపుగా వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఆమె ముందర కొంతమంది వ్యక్తులు డాన్స్ వేస్తూ ఆమెను స్వాగతిస్తూ ఉన్నారు. అయితే ఈమెను చూడడానికి పెద్ద ఎత్తున జనాలు రావడం జరగడంతో.. ఆ జనాలను కంట్రోల్ చేసేందుకు బౌన్సర్లు సైతం కూడా నియమించుకున్నారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: