తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయిన చియాన్ విక్రమ్ తాజాగా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో చియన్ విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించగా ,  అజయ్ జ్ఞానముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు సినిమా ప్రేమికులు కూడా కోబ్రా మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించడంలో కాస్త విఫలం అయిన కోబ్రా మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీ నుండి ప్రముఖ  'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినా సోనీ లివ్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఏ సినిమా సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయిన కోబ్రా మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: