తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల పాటు తెలుగు లో ఎన్నో సినిమాలను నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని రూపొందిస్తున్నాడు.

మూవీ లో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  అంజలి , సునీల్మూవీ లోఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. న్యూజిలాండ్ లోని అందమైన లోకేషన్ లలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ లపై ఒక సాంగ్ ను మూవీ యూనిట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే న్యూజిలాండ్ లో కొన్ని మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను కూడా మూవీ యూనిట్ వ్యతిరేకరించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే షో లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు , రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ గురించి కీలక విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ మూవీ తో పాటు ఇండియన్ 2 మూవీ కి పనిచేస్తున్నాడు. నెలలో 12 రోజులు రామ్ చరణ్ మూవీ కి శంకర్ పనిచేస్తూ ఉండగా , మరో 12 రోజులు ఇండియన్ 2 మూవీ కి పనిచేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: