తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సిద్దు జోన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లో ఎన్నో మూవీ లలో హీరో గా నటించినప్పటికీ డీజే టిల్లు మూవీ తో ఈ హీరో కు అద్భుతమైన క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. డీజే టిల్లు మూవీ లో సిద్దు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ , బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కూడా యూత్ ను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడం తో , ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా లభించాయి. డీజే టిల్లు మూవీ తో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇలా డీజే టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో ఈ మూవీ కి సిద్దు జొన్నలగడ్డ సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు. అందులో భాగంగా ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

కాకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ నుండి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. డిజె టిల్లు మూవీ యూనిట్ అనుపమ పరమేశ్వరన్ ప్లేస్ లో మడోనా సబాష్టియన్ తీసుకోబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే డీజే టిల్లు మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: