
అయితే ఈ ప్రశ్న అడిగే విధానమే ఒక్కసారిగా బాధను కలిగిస్తోందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. కొందరు ఈ నెలసరి నొప్పిని చిన్న విషయంగా పరిగణిస్తూ వ్యంగ్యంగా మాట్లాడతారని ఆమె చెప్పుకొచ్చారు. దీనిని అర్థం చేసుకున్న వాళ్లు మాత్రం మనకు ప్రశాంతత కలిగేలా వ్యవహరిస్తారని జాన్వీ కపూర్ అన్నారు. విశ్రాంతి తీసుకోమని కొంతమంది సలహాలు ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
పీరియడ్ పెయిన్ అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుందని ఆ సమయంలో మేము పడే బాధను ఈ మానసిక స్థితిని అబ్బాయిలు నిమిషం కూడా భరించలేరని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే మాత్రం ఆ నొప్పికి అణు యుద్ధాలే జరిగేవేమో అని జాన్వీ కపూర్ వెల్లడించారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు.
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో పెద్ది సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జాన్వీ కపూర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే తిరుగుండదని చెప్పవచ్చు.