ఏంటి శుభమాని పెళ్లి జరుగుతుంటే అక్కినేని అఖిల్ వివాదంలో ఇరుక్కున్నారా.. ఇంతకీ అక్కినేని అఖిల్ చేసిన తప్పేంటి.. అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంచి జరుగుతుంటే ఎందుకు సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ ట్రోలింగ్ కి గురవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని అఖిల్ తాజాగా అనగా జూన్ 6 ఉదయం మూడు గంటలకే జైనబ్ రావడ్జీ తో ఏడెడుగులు వేశారు.వీరిద్దరి పెళ్లి ఉదయాన్నే జరిగింది. ఇక వీరి పెళ్లికి సినీ సెలబ్రిటీలు అయినటువంటి చిరంజీవి దంపతులు, రాంచరణ్ దంపతులు,శర్వానంద్, ప్రశాంత్ నీల్ వంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు,బిజినెస్ మాన్ లు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా చాలామంది హాజరయ్యారు. 

అయితే పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్న అక్కినేని అఖిల్ సోషల్ మీడియాలో నెటిజన్స్ కి బుక్ అయిపోయారు. ఎందుకంటే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్న జైనబ్ రావడ్జీ వయసు దాదాపు అఖిల్ కంటే 10 ఏళ్లు పెద్దదని.. వయసులో పదేళ్లు పెద్దదైన జైనబ్ ని అఖిల్ ఎలా పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. అయితే జైనబ్ రావడ్జి అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుండి జైనబ్ ఏజ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఖిల్ కంటే జైనబ్ పదేళ్లు పెద్దదని రూమర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా జైనబ్ ఏజ్ విషయం మాత్రం బయటపడలేదు.

ఇక జైనబ్ రావడ్జి హైదరాబాద్ మూలాలు ఉన్న అమ్మాయే అయినప్పటికీ ముంబైలో సెటిల్ అయినా ఫ్యామిలీ.జైనబ్ రావడ్జి తండ్రి ప్రముఖ బిజినెస్మేన్ కావడంతో వీరికి చాలా దేశాల్లో బిజినెస్ లు ఉన్నాయట.అలా దుబాయ్, అరబ్ వంటి దేశాల్లో కూడా రావడ్జి ఫ్యామిలీస్ కి అనేక బిజినెస్ లు ఉన్నాయట. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ అఖిల్ కంటే జైనబ్  10 ఏళ్లు పెద్దదనే మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో అఖిల్ ని ఇరకాటంలో పెట్టింది.కానీ నేషనల్ మీడియాలో మాత్రం జైనబ్ రావడ్జి వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: