బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కియారా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ స్పెషల్ గిఫ్ట్ ను పంపింది. అది చూసి కియారా ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది.


సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో పుల్లగా తినాలని అనిపిస్తుంది. అందుకే పచ్చి మామిడి కాయ‌ల‌తో తయారు చేసిన నోరూరించే ఆవ‌కాయ‌ పచ్చడిని కియారా అద్వానీ కోసం పంపింది ఉపాస‌న‌. ఇటీవల తన అత్త సురేఖ కొణిదెల‌తో కలిసి ఉపాసన `అత్తమ్మాస్ కిచెన్` ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కియారాకు తాజాగా పంపిన మ్యాంగో పికిల్ ఈ కిచెన్ లో తయారు చేసిందే. మ్యాంగో పికిల్ తో పాటు ప్రియమైన కియారాకు ఉపాసన ఓ లేఖ‌ను కూడా సెండ్ చేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న కియారా.. ఉపాసన-రాంచరణ్ దంపతులకు థాంక్స్ చెప్పింది. కాగా, `వినయ విధేయ రామ` చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా కియారా తొలిసారి నటించింది. అప్పటినుంచే ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `గేమ్ ఛేంజ‌ర్‌` మూవీలో మరోసారి రామ్ చరణ్, కియారా జంటగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడక పోవడం గ‌మ‌నార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: