అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఎప్పుడు వచ్చామా..? అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అదే పాయింట్ . ప్రెసెంట్ అదే డైలాగ్ తో రెబల్ స్టార్ ప్రభాస్ ని ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.  పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్  సంపాదించుకొని తను  నటించే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్న హీరో ప్రభాస్ నుంచి త్వరలోనే రాబోతున్న బిగ్  కామెడీ ఎంటర్టైనర్ మూవీ " రాజాసాబ్ ". టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .


రీసెంట్ గానే ఈ సినిమా నుంచి టీజర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు . ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యాంతం ద్రిల్లింగ్ తో అద్భుతంగా ఎంటర్టైరింగ్ గా ఉండటమే కాకుండా డార్లింగ్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో నచ్చేసింది . చాలా కాలం తర్వాత డార్లింగ్ లోని వేరే యాంగిల్ ను చూడబోతున్నామంటూ ఈ టీజర్ తెలిసేలా చేసింది . డార్లింగ్ ఫ్యాన్స్ కి అయితే ఈ టీజర్ ఫుల్ మిల్స్ లాంటిదే . ఇక సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి రచ్చ రంబోలా గానే ఉంటుంది . కాగా టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే యూట్యూబ్లో ఏకంగా 59 మిలియన్లకు  పైగా వ్యూస్ దక్కించుకుంది.



ఇంత భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న రాజా సాబ్  టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు బిగ్ స్టార్స్ అయినా అల్లు అర్జున్ - తారక్ - రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇంతకంటే ఎక్కువ వ్యూయ్స్ దక్కించుకున్నాయి . కానీ ఒక కామెడీ యాంగిల్ లో ఒక హారర్ ఎలిమెంట్ బ్యాక్ డ్రాప్ లో టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఈ విధంగా వ్యూస్ దక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి . అది కూడా ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ సినిమా టీజర్ తోనే పరిస్థితులు ఈ విధంగా మారిపోతే ఇక సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగ రాయడం పక్క అంటున్నారు అభిమానులు.  ఎంత పెద్ద స్టార్ రికార్డులైనా సరే రాజా సాబ్  అడుగుపడితే అన్ని తుక్కుతుక్కు అయిపోవాల్సిందే అంటూ  ట్రెండ్ చేస్తున్నారు . ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్ - మాళవిక మోహన్ - రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . ధమన్ సంగీతం ఈ సినిమాకి మరింత ప్లస్ గా  మారబోతుంది అంటున్నారు మేకర్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: