స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రభాస్ సినిమాలు విడుదలైతే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఈ ఏడాది రాజాసాబ్ సినిమాతో వచ్చే ఏడాది మరిన్ని క్రేజీ ప్రాజక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్నభారీ బడ్జెట్ సినిమాలలో రెండు సినిమాలకు ఓటీటీ డీల్స్ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో ఆ సమయానికి ఓటీటీ డీల్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

ప్రస్తుతం ఓటీటీ సంస్థలు సినిమాల హక్కులు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేసి సినిమాలు ఫ్లాప్ అయితే  నిర్మాతలు నష్టపోతున్నారు.  ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ  సినిమాలు ఓటీటీలో సైతం సంచలనాలు సృష్టించాయి. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు ఓటీటీలో సంచలనాలు  సృష్టిస్తే  ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయాల రేంజ్ లో ఉందనే తెలిసిందే.  ప్రభాస్ స్థాయిలో పారితోషికం  అందుకుంటున్న హీరోలు  చాలా తక్కువమంది ఉన్నారు.  ప్రభాస్ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించారు.  రాజాసాబ్ మూవీ హిందీ ట్రైలర్ కు సైతం రికార్డ్  స్థాయిలో వ్యూస్ వచ్చాయి.  ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ కు  దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.  తర్వాత సినిమాల ప్రమోషన్స్ లో  ప్రభాస్  పాల్గొంటారేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే  సంచలన రికార్డులు  ఉన్నాయి భవిష్యత్తు సినిమాలతో సైతం ప్రభాస్   సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.  దర్శకుడు మారుతి ఫ్లాపుల్లో ఉన్నా ప్రభాస్ నమ్మి అతనికి అవకాశం ఇచ్చారనే సంగతి తెలిసిందే.  ప్రభాస్ సాధిస్తున్న  రికార్డులు ఫ్యాన్స్ కు సైతం ఎంతో  సంతోషాన్ని కలిగిస్తున్నాయి.  ప్రభాస్  కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృస్తిస్తే ఫ్యాన్స్  సంతోషానికి అవధులు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: