
టాలీవుడ్ కింగ్, ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇటీవల కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మల్టీస్టారర్ సినిమా అటు ఓవర్సీస్‌తో మొదలు పెట్టి.. ఏపీ, తెలంగాణ అంతటా దూసుకుపోతోంది. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటనగురించి ప్రత్యేకంగా ఇప్పుడు సినీ సర్కిల్స్‌తో పాటు అటు ప్రేక్షకుల్లోనూ చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా కింగ్ నాగార్జునను ఆయన వయస్సుకు తగినట్టుగా ఆయన అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఏ తరహా రోల్స్ చేయాలని కోరుతున్నారో కుబేర సినిమాలో నాగ్‌కు అదే పాత్ర దక్కడం.. ఆ పాత్రకు ప్రాణం పెట్టి నటించడంతో నాగ్‌పై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యి చర్చ నడుస్తోంది. నాగార్జున టాలీవుడ్ టాప్ లీగ్ హీరోలలో ఒకరు. గత కొన్నేళ్లుగా నాగార్జున ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్నా వాటన్నింటికంటే కుబేర సినిమాలో ఈ పాత్ర బాగా సక్సెస్ అవ్వడంతో పాటు మంచి పేరు తీసుకువచ్చింది. నాగార్జున ఈ పాత్ర చేసేందుకు ఒకే చెప్పడానికే నిజంగా గట్స్ ఉండాలి. ఈ పాత్రకు నాగ్ ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఆది కూడా నాగ్ కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడంతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక సినిమాలో నాగార్జున నటన గురించి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే, ఆయనను ఎంకరేజ్ చేస్తూ నాగ్ ఈ పాత్ర చేయడమే సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో ఈ పాత్రతో నాగ్ ఓ రేంజ్‌లో కం బ్యాక్ అయ్యాడనే చెప్పాలి. కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్..
ఈ పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్ ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా కుబేరతో ఒక్కసారిగా నాగార్జున పేరు ఒక రేంజ్‌లో మార్మోగుతోంది.