వరుసగా పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 మూవీలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ ప్రచార చిత్రాల ద్వారా ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు క్లియర్గా అర్థం అవుతుంది.

ఓ వైపు బన్నీ , అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూనే మరో వైపు బన్నీ మలయాళ నటుడు కమ్ దర్శకుడు అయినటువంటి బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు , అది శక్తిమాన్ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్నట్లు వార్తలు బలంగా వైరల్ అయ్యాయి. దానితో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తర్వాత బన్నీ , బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో శక్తిమాన్ అనే టైటిల్ తో  తెరకేక్కబోయే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తాడు అని చాలా మంది నమ్మారు.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాసిల్ జోసెఫ్ , అల్లు అర్జున్ తో సినిమా గురించి పెద్ద బాంబు పేల్చాడు. అసలు విషయం లోకి వెళితే ... శక్తిమాన్ అనే సినిమాను నేను బాలీవుడ్ నటుడు అయినటువంటి రన్బీర్ సింగ్ తో చేయాలి అనుకుంటున్నాను. కచ్చితంగా అతని తోనే చేస్తాను అని బాసిల్ జోసెఫ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. దానితో అల్లు అర్జున్ హీరోగా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో శక్తిమాన్ అనే సినిమా ఉండదు అని ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa