బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన షారుఖాన్ ను  కాదని డాన్ చిత్రంలోకి రణవీర్ సింగ్ ను  తీసుకురావడం జరిగింది.ఫర్హాన్ అక్తర్ డాన్ ప్రాంచైజీ మూడో భాగాన్ని ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రారంభం కావడానికి కొన్నేళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సరైన విలన్ దొరకడం లేదన్నట్లుగా వినిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ మొదటి రెండు భాగాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇప్పుడు రణవీర్ ఈ పాత్రలో ఎలా మెప్పిస్తాడో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.


అయితే డాన్ 3 సినిమాలో ప్రతిభావంతమైన పాత్రలో విక్రాంత్ యాన్సే కు అవకాశం ఇచ్చిన తిరస్కరించారని వార్తలు వినిపించాయి.  అతడి రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పాత్ర కోసం టాలీవుడ్ హీరో అయిన విజయ్ దేవరకొండ ను దర్శకని నిర్మాతలు సంప్రదించినట్లుగా వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కూడా ఈ పాత్రని కాదనుకున్నాడని తెలుగులో వరుస సినిమాల షూటింగ్ల కారణంగా డేట్లు అడ్జస్ట్  చేయలేనంటూ తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకవేళ విలన్ పాత్రలో నటిస్తే తన ఇమేజ్ కు  డ్యామేజ్ వస్తుందని భావించి వదులుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఫర్హాన్ బృందం మాత్రం ఈ పాత్ర కోసం మరొక నటుడు ఎంపిక చేయబోతున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పాత్ర పరిమితులు అలాగే హీరో ఇమేజ్ ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్టుగా సరైన నటుడిని ఈ పాత్రకు ఎంపిక చేయాల్సి ఉన్నదట. రణబీర్ సింగ్ లాంటి హీరోకి మ్యాచ్ అయ్యేలా ఒక భయంకరమైన విలన్ గా విజయ్ దేవరకొండ సరిపోతాడు కానీ నటించడానికి నిరాకరించడానికి ముఖ్య కారణం ఆ పాత్ర ఆశించిన స్థాయిలో స్ట్రాంగ్ గా డిజైన్ చేయలేకపోవడమే అన్నట్లుగా మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి నటిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: