మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే తెలుగు లో కూడా పలు సినిమాలలో నటించింది. అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె మలయాళ సినిమా అయినటువంటి లోక చాప్టర్ 1 అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

మూవీ కొంత కాలం క్రితమే మలయాళం తో పాటు మరికొన్ని భాషలలో కూడా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ లో అనేక విషయాలలో కొత్త కొత్త రికార్డులను కూడా సృష్టిస్తుంది. తాజాగా ఈ మూవీ మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఓ కొత్త రికార్డును సృష్టించింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు అధికారికంగా విడుదల చేశారు. 

తాజాగా ఈ మూవీ యూనిట్ ఇప్పటివరకు బుక్ మై షో యాప్ లో ఏ మలయాళ సినిమాకు సెల్ కానాన్ని టికెట్లు ఈ మూవీ కి సేల్ అయినట్లు , దానితో ఈ సినిమా బుక్ మై షో లో అత్యధిక టికెట్లు సేల్ అయిన మలయాళ సినిమాలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా మలయాళ సినిమా పరిశ్రమలోనే బుక్ మై షో లో అత్యధిక టికెట్లు సెల్ అయిన సినిమాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kp