పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కొంత కాలం క్రితం పవన్ "హరిహర వీరమల్లు" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఈ మూవీ తర్వాత పవన్ "ఓజి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవన్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో రాశి కన్నా , శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం పవన్ , హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చి మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో ప్రస్తుతం రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యొక్క మొదటి సాంగ్ ను ఎప్పుడు విడుదల చేస్తారా అని పవన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని మొదటి పాటను డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కూడా వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: