అంతేకాకుండా రష్యా యుద్ధ విమానాలు క్షిపణుల ను ఎంతో సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కూడా అప్రమత్తం అయిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే రష్యా కు ఊహించని షాక్ తగిలింది అని అర్థమవుతుంది. కేవలం నిన్న ఒక్క రోజులోనే 800 మంది సైనికులను మట్టుబెట్టాము అని ఇటీవలే ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా రష్యాకు చెందిన ఏడు యుద్ధ విమానాలను ఆరు ఎలికాప్టర్లను 140 ఫైటింగ్ వెహికల్స్, 31 యుద్ధ విమానాలను కూడా నాశనం చేశాము అంటూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక రష్యా దాడుల్లో ఉక్రెయిన్ కు చెందిన 130 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అయితే ఇక ఉగ్రవాదంపై 160 క్షిపణుల తో విరుచుకుపడుతుంది రష్యా.
ఇక రెండవ రోజు కూడా పలు నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది అన్నది తెలుస్తుంది. మొదటిరోజు కేవలం సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నేలమట్టం చేసిన రష్యా ఇక రెండవ రోజు ఏకంగా జనావాసాలున్న ప్రాంతాలలో దారుణంగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ నగరం పై మూడు వైపుల నుంచి దాడి చేస్తూ ఇక రష్యా యుద్ధ విమానాలు విరుచుకు పడుతున్నాయి. యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇక ప్రపంచ దేశాల మద్దతు కోరుతుంది ఉక్రెయిన్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి