ఢిల్లీలో ఇంత‌వ‌ర‌కూ టీడీపీ కి సొంతంగా కార్యాల‌యం అన్న‌దే లేదు. మొన్న‌టి ఎన్నిక‌ల వేళ ఫ‌లితాల దృష్ట్యా ఇప్ప‌టి పార్ల‌మెంట్ పార్టీ కార్యాల‌యం కూడా అక్క‌డ ఉంచ‌కూడ‌దు అని భావించారు మోడీ మ‌రో చోటకు త‌ర‌లించాల‌ని సూచించారు కూడా! కానీ మోడీ ఎందుక‌నో వెనక్కుత‌గ్గారు. లోక్ స‌భ‌లో ముగ్గురు ఎంపీలున్న పార్టీకి కార్యాల‌యం అన్న‌దే పెద్ద జోక్. మొత్తానికి లాబీయిం గ్ ఫ‌లించి ఆ ముగ్గురికీ కార్యాల‌యం అన్న‌ది అక్క‌డే ఉండిపోయింది. ఇక రాజ్య‌స‌భ  ఎంపీ క‌న‌మేడ‌ల ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌నేపాటి రాజకీయం చేస్తారో అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. పార్టీ ఎంపీల‌లో ఒక్క కింజ‌రాపు రాము మిన‌హా మిగ‌తా వారంతా త‌మ,త‌మ వ్య‌క్తి గ‌త ప్ర‌యోజ‌నాల ప‌ర‌మావ‌ధిగా ఢిల్లీ రాజ‌కీయాలు నెర‌పుతురాన్న విమ‌ర్శ కూడా ఉంది.

 

ఏదేమైన‌ప్ప‌టికీ టీడీపీ ఇప్ప‌టికీ ఎన్టీఆర్ భ వ‌న్ ను ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లే చేయ‌లేదు. టీఆర్ఎస్ మాత్రం ఈ విష‌య‌మై ముం దడుగు వేసి కేంద్రం నుంచి స్థ‌లం ద‌క్కించుకు ని మ‌రో ఆరు నెల‌ల్లో సొంత భ‌వంతి ఏర్పాటుచేయ‌నుండ‌డ‌మే విశేషం. కేసీఆర్ క న్నా రాజ‌కీయ చాణ‌క్యుడు చంద్ర‌బాబు. ఎన్నో సం ద‌ర్భాల‌లో ఢిల్లీ పాలిటిక్స్ ను న‌డిపిన‌, న‌డ‌పాల‌ని భావించిన లీడ‌ర్ ఆయ‌న‌. దేశ ప్ర‌ధానుల‌తో నేరు సంబంధాలున్న వ్యక్తి. ద‌క్షిణాది నుంచి హ‌స్తిన‌కు పోయి ప్రాంతీయ పార్టీల స‌త్తా ఏ విధంగా ఉంటుందో తేల్చి చెప్పిన ఎన్టీఆర్ కు అల్లుడు. ఎందుక‌నో సొంత భ‌వ‌నం అన్న విష‌య‌మై ఆయ‌న ఏనాడూ ఆలోచ‌న చేయ‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో సొంత కార్యాల‌యం అంటూ లేదు అవ‌న్నీ పార్ల‌మెంట్ ఆఫీసు కేటాయించిన కార్యాలయాలే కావ‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్ మాత్రం బీజేపీ నేతల‌తో ఉన్న అనుబంధాల‌ను ఉప‌యోగించుకుని మంచి ఏరియాలోనే స్థ‌లం సంపాదించి కొ త్త భ‌వంతికి ఏర్పాటు చేయ‌డం టీడీపీని పున‌రాలోచ‌న‌న‌లో  ప‌డేసింది. ఓ విధంగా చంద్ర‌బాబు కేసీఆర్ విష‌య‌మై ఓడిపోయాడు. వెంక‌య్య నేతృత్వంలో ఆ మ‌ధ్య కాస్త ప‌నిచేసిన చంద్ర‌బాబు ఓడిపోయాడు. మోడీ తో ఆ మ‌ధ్య కాస్త ఎక్కువ స్నేహ‌మే చేసిన చం ద్ర‌బాబు ఓడిపోయాడు. జ‌య‌ల‌లిత మొద‌లుకుని స్టాలిన్ వ‌ర‌కూ ముఖ్య‌మంత్రుల‌తో మంచి దోస్తీ ఉన్న చంద్ర‌బాబు ఓడిపోవడం, ఢిల్లీలో ఓ సొంత గూడు లేక‌పోవ‌డం సంభ్ర‌మాశ్చ‌ర్య కార‌కం.



మరింత సమాచారం తెలుసుకోండి: