ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఏ పార్టీ ప‌రిస్థితి ఏంటి?  ఎవ‌రు పుంజుకుంటా రు?  ఎవ‌రు.. ఆధిక్య‌త సాధిస్తారు?  అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిగా మారాయి. తాజాగా వైసీపీ నిర్వ‌హించిన ముంద‌స్తు ఎన్నిక‌ల స‌ర్వేలో.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ.. వైసీపీకి ఎదురుగాలి త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌చ్చాయి. ము ఖ్యంగా.. జ‌న‌సేన‌-టీడీపీ క‌నుక క‌లిసి పోటీకి దిగితే.. టీడీపీ బ‌ల‌ప‌డే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా య‌ని .. ఈ స‌ర్వే చాటి చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. గ‌త 2019 ఎన్నికల్లో వ‌చ్చిన ఫ‌లితాన్ని వైసీపీ నిల‌బెట్టుకో కపోగా.. భారీ స్థాయిలో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌చ్చాయి.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే ప‌శ్చిమ‌లో ఈ ద‌ఫా పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని.. వైసీపీ నిర్వ హించిన స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలిసిపోయింది. గ‌త 2019లో రెండు స్థానాల్లో ఈ పార్టీ విజ‌యం ద‌క్కించుకుం ది. పాల‌కొల్లు, ఉండి నియోజ‌క‌వ‌ర్గాల్లో.. టీడీపీ విజ‌యం సాదించింది. అయితే.. ఇప్పుడు ఈ రెండు నియో జ‌క‌వ‌ర్గాలు నిల‌బెట్టుకోవ‌డంతోపాటు.. న‌ర‌సాపురం, భీమ‌వ‌రం, ఆచంట‌, త‌ణుకు, కొవ్వూరు, నిడ‌ద‌వోలు, గోపాల‌పురం, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు వంటి మ‌రో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సునాయాసం గా విజయం ద‌క్కించుకుంటుంద‌ని.. వైసీపీ నిర్వహించిన స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది.

అంటే.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ వ‌న్ సైడ్ దూకుడు క‌నిపిస్తోంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, 2014లో భారీ రేంజ్‌లో దూకుడు చూపించిన వైసీపీ... ఇప్పుడు మాత్రం మూడు స్థానాల‌కే ప‌రిమితం అయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  చింత‌ల‌పూడి, పోల‌వ‌రం, తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వర్గాలు మాత్ర‌మే.. వైసీపీకి ద‌క్కుతాయ‌ని అంచ‌నా. దీనికి కూడా కొన్ని కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

పోల‌వ‌రం , చింత‌ల‌పూడి మెట్ట‌ప్రాంతాల్లో ఉండ‌డం.. టీడీపీకి చింత‌లపూడిలో నాయ‌కులు లేక‌పోవ‌డం.. పోల‌వ‌రంలో ఉన్నా పుంజుకోక పోవ‌డం వ‌ల్ల‌.. ఇక్క‌డ వైసీపీ మ‌ళ్లీ పాగా వేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. తాడేప‌ల్లి గూడెంలో కొత్త ఇంచార్జ్ కార‌ణం.. ఆయ‌న మ‌రింత పుంజుకోవాల్సిన నేప‌థ్యంలో  టీడీపీ ఇక్క‌డ వ‌దిలేసినా.. మిగిలిన జిల్లా వ్యాప్తంగా.. పుంజుకోవ‌డం.. వ‌న్ సైడ్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే ఇది ఇప్ప‌టి ప‌రిస్థితి. ఈ పొత్తు కాస్త ముందుగానే ఉంటే 2014లోలా జిల్లా అంత‌టా టీడీపీ + జ‌న‌సేన స్వీప్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: