టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత కొంతకాలంగా పార్టీ విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాము. పార్టీలో కొంతమంది నాయకులు ఆయన విషయంలో సీరియస్ గా ఉన్నా సరే అచ్చం నాయుడు మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. పార్టీలో కొంతమంది నాయకులు ఇబ్బందులు పడుతూ ఫిర్యాదులు చేస్తున్నా సరే ఆయన ఆలోచన మాత్రం మారడం లేదు. చాలా మంది నాయకులకు ఆయన క్రమంగా వార్నింగ్ ఇవ్వడం అదేవిధంగా పార్టీలో చేసే కార్యక్రమాలకు సంబంధించి తన మాట నెగ్గాలి అనే విధంగా ఆయన వ్యవహరించడం ఇబ్బంది పెట్టింది.

అయితే ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అర్జెంట్ గా మార్చాలనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ లో వినపడుతోంది. ఇటీవల ఇతర నియోజకవర్గాల్లో వెళ్లి నాయకు లకు సంబంధించి ఆయన కొన్ని హెచ్చరికలు చేయడం ఆ తర్వాత కార్యకర్తలకు కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూ పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ఇబ్బంది పెట్టిన అంశం. కాబట్టి ఆయనను వెంటనే మార్చకపోతే మాత్రం పార్టీ నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయని విమర్శలు తీసుకోలేని అచ్చం నాయుడు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు లాంటి నాయకుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగస్తులు కూడా కొన్ని ప్రాంతాల్లో అచ్చెన్నాయుడు కారణంగా ఇబ్బంది పడ్డారు అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇప్పుడు పార్టీ నాయకులను కూడా అచ్చం నాయుడు ఈ విధంగా ఇబ్బంది పెట్టడంతో చాలామంది నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. కనీసం సొంత జిల్లా నాయకులు కూడా కలుపుకొని వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని కుటుంబంలో ఉన్న కొంతమంది ని కూడా కలుపుకొని వెళ్లలేని స్థితిలో ఉన్నారని ఆయన వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: