ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ అందరినీ కలవరపరుస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి తోడు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా సరే వైరస్ సోకుతుంది అంటూ వచ్చే పుకార్లు ప్రజల్లో మరింత భయాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటి ఓమిక్రాన్ వైరస్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కానీ ప్రపంచ దేశాలు మాత్రమే ముందే అప్రమత్తం అయ్యాయి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇక భారత్ కూడా ఆఫ్రికా దేశం నుంచి వచ్చే వారికి తప్పని సరిగా స్ర్కీనింగ్ నిర్వహించాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఓమిక్రాన్ వేరియంట్ వైరస్... ఇప్పటికే 14 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని... దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని భయపడుతున్నారు.

ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను చాలా దేశాలు నిషేధం విధించాయి. భారత్ కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించింది. అయితే... భారత్ కూడా ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫస్ట్ వేవ్ సమయంలో అమలు చేసినట్లుగా కఠినంగా వ్యవహారించాలని కేజ్రీవాల్ సూచించారు. సెకండ్ వేవ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందుకే ప్రాణ  నష్టం భారీగా ఉందన్నారు. ఇప్పటికే థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. కేంద్రంల కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్ వైరస్ నేపథ్యంలో... ఢిల్లీ అధికారులతో కేజ్రీవాల్ రివ్యూ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ నిబంధనల అమలు, ప్రయాణాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఆలస్యం చేయడం వల్ల వైరస్ వ్యాప్తికి సహకరించిన వారు అవుతారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ప్రయాణికులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేజ్రీవాల్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: