పిల్లలు  సన్మార్గంలో వెళ్లాలి అంటే అతని తల్లిదండ్రుల ప్రవర్తన కూడా ఎంతో చక్కగా ఉండాలి అనే విషయం తెలిసిందే. పిల్లలు ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రులు వారి ముందు ఏదైనా చెడ్డ పనులు చేస్తే పిల్లలు కూడా అలాంటి చెడు పనులు చేయాలని ప్రభావితులు అవుతూ ఉంటారు. ఇక దీనికి సంబంధించి నిపుణులు ఎప్పటికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఎన్నో సినిమాల్లో కూడా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. తండ్రి రౌడీ అయితే ఇక కొడుకురౌడీ అవుతూ ఉంటాడు. తండ్రి ఏదైనా నేరం చేస్తే కొడుకు కూడా అలాంటి నేరాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.


 ఇలా అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు తల్లిదండ్రుల నుంచి అన్ని విషయాలు నేర్చుకుంటారు అని మానసిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నదానికి  ఇక్కడ జరిగిన ఘటనే  నిదర్శనంగా మారిపోయింది. సాధారణంగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం తండ్రి మద్యం తాగుతూ ఉంటే ఇక స్కూల్ విద్యార్థిగా ఉన్న కొడుకు కూడా పక్కనే వచ్చి కూర్చోవడం మద్యం తాగుతా అంటూ చెప్పడం చూస్తూ ఉంటాం. ఇలాంటివి చూసినపుడు చాలామంది నవ్వుకుంటూ ఉంటారు. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటివి జరిగితే మాత్రం షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 ఏకంగా తండ్రి మద్యం తాగుతున్నాడు అని పలుమార్లు చూసిన విద్యార్థి తాను కూడా మద్యం తాగాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎక్కడో తాగడం ఎందుకు రోజు వెళ్లే స్కూల్ లోనే మద్యం తాగితే సరిపోతుంది కదా అని భావించాడు. భోజనం సమయంలో రెండు మద్యం సీసాలు తెచ్చుకొని స్కూల్లోనే స్నేహితులతో మద్యం తాగడం మొదలు పెట్టాడు. అయితే  విద్యార్థుల ప్రవర్తనను గమనించారు పాఠశాల సిబ్బంది.  ప్రధానోపాధ్యాయుడికి  ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ప్రవర్తన తో షాక్ అయిన ప్రధానోపాధ్యాయులు ఇక మద్యం సేవించి విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించాడు. ఈ ఘటన ఎక్కడో కాదు కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పాఠశాలలో చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: