
ఒకటి స్పీకరు ఇలాకా
రెండు మంత్రి ధర్మాన ఇలాకా
ఈ రెండూ దాటి ఇసుక బయటకు పోవడం కష్టం.
ఆ రోజు లోకేశ్ బాబు ఆరోపణలు ఎదుర్కొంటే
ఇవాళ జిల్లాలో ఈ ఇద్దరూ బలీయమయిన రీతిలో
అభియోగాలు ఎదుర్కొంటున్నారు
అయినా కూడా ఎక్కడా ఈ విషయం మీడియాలోకి
రాకపోవడంలో విడ్డూరం ఉంది
ఎవరు ఏం అనుకున్నా సరే బర్త్ డే రోజున (జగన్ పుట్టిన్రోజున) నాలుగంటే నాలుగు మంచి మాటలు చెప్పి తీరాలి. ఆ రోజు లోకేశ్ హయాంలో ఇసుక ర్యాంపులు హాయిగా నడిచేయి అన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో స్థానిక ఆమదాలవలస టీడీపీ నేతలకూ వాటాలు ఉన్నాయి అన్న విమర్శలు వచ్చాయి. అవన్నీ నిరూపణ చేయలేక వైసీపీ ఎందుకనో సైలెంట్ అయిపోయి అధికారం ద క్కగానే రూటు మార్చి తనదైన పంథాలో ఇసుక దందాలు యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఇదీ ఇవాళ్టి ఘరానా మోసం. ఇసుక త వ్వకాలకో అనుమతి ఉందో లేదో కానీ మహామహుల చర్యలకు మాత్రం అడ్డూ అదుపూ అన్నవే లేవు.
ఇసుక ర్యాంపులు అన్నీ శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం హవాలో ఉన్నాయని అనలేం కానీ ఆయన మాట దాటి వంశధార ఇసుక మాత్రం ఊరు దాటి పోవడం లేదు. ఆ మాటకు వస్తే ఎక్కడిక్కడ వైసీపీ వర్గాలు ఇసుక ద్వారా బాగానే అనగా దండీగానే లాభాలు పొంది ఉన్నాయి. ఇక జిల్లాలో మైనింగ్ ప్రాసెస్ పెద్దగా లేదు కనుక ఆ వైపుగా కొందరు చూడడం లేదు కానీ టెక్కలి కేంద్రంగా నడిచే గ్రానైట్ వ్యాపారానికి ఢోకానే లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ వ్యాపారం అస్సలు ఆగదు. అది లైసెన్సెడ్ వెర్షన్ కావొచ్చు లేదా అన్ లైసెన్సెడ్ వెర్షన్ అవ్వొచ్చు కానీ దేనిపై కూడా నిఘా అన్నదే ఉండదు.
మామూలుగానే ఆ మంత్రి ప్రత్యేకం.. ఆ మంత్రిది మా శ్రీకాకుళం కనుక ప్రత్యేకం. అంతేకాదు డిప్యూటీ సీఎం కనుక ఇంకా ప్రత్యేకం. వంశధార ఇసుక ఏరు దాటి ఊరు దాటిపోతుంది..అందుకు మా డిప్యూటీ సీఎం సహకారం ఎంతో ఉంది. ఉండాలి కూడా! ఎందుకంటే వంశధార నదీ పరివాహక ప్రాంతం అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన నియోజకవర్గం అనగా నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అంతేకాదు ఇసుక అంతా గుట్టు చప్పుడు కాకుండా విశాఖకు తరలిపోతా ఉంటే మన గౌరవ యంత్రాంగం మాత్రం
అలానే చేష్టలుడిగి చూస్తోంది. ఎక్కడా ఏ అనుమతులూ ఉండవు. ఎక్కడా ఏ విధంగా నియమ నిబంధనలూ ఉండవు. ఆయన నేతృత్వంలోవెళ్లే ఇసుకకు లెక్కలేదు. నిజమే! ఆయన చెప్పించే లెక్కలకు సూత్రం అన్నదే ఉండదు. అవును డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆయన మాట శాసనం. అంత గొప్పగా పాలన జరుగుతా ఉంటే ఎవ్వరూ అడగరు. ఎవ్వరూ ప్రశ్నించరు.