ఉత్తరాఖండ్ రాష్ట్రం... భారత్ లోని అన్ని రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రం పై ఓ కన్నేశాయి. ఎందుకో తెలుసా ? మరి కొద్ది మాసాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాలు తమ సత్తా చాటేందుకు అన్ని అస్త్రాలతో సమాయత్తం అవుతున్నాయి. ఇదే సమయంలో కోవిడ్-19 నూతన వేరియంట్ ఓమిక్రాన్ కూడా తానేంటో అక్కడి ప్రజలకు చూపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం ధైర్యంగా ఓ అడుగు ముందు కేసింది. కొన్ని చర్యలు చేపట్టింది. ఇవి దేశానికంతటికీ మార్గదర్శకం అని మీడియా జన వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఆ రాష్ట్రం తీసుకున్న చర్యలు ఏంటి ?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నాటికి కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. దీంతో ఆ రాష్ట్రం అలెర్ట్  అయింది. ఆది వారం నుంచి రాష్ట్రంలో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పాఠశాలలు, స్విమ్మింగా పూల్ లు, వాటర్ పార్కులు, వినోద కేంద్రాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ఆడిటోరియంలు, సినిమా హాళ్లు, జిమ్ లు షాపింగ్ మాల్స్ అన్ని కూడా యాభై శాతం మాత్రం ఉండాలని సూచించింది. అంతే కాకుండా ప్రతి రోజూ రాత్రి పది గంటల  నుంచి ఉదయం ఆరు గంటల వరకూ రాత్రి కర్ఫ్యూను  విధించింది. పొరుగు రాష్ట్రల నుంచి  ఉత్తరాఖండ్ లో ప్రవేశించే వారు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకుని రావాలని, అంతే కాకుండా ఆర్.టి.పి.సి.ఆర్ నెగటివ్ సర్ఠిఫికేట్ ను చూపించాలని అదేశించింది. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైన ఆదేశం కూడా జారీ చేసింది.
ఆ రాష్ట్రం ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ ఎన్నికల ర్యాలీలపై కూడా నిెషేధం విధించింది. ఈ నిషేధం జనవరి 16వ తేదీ వరకూ అమలు లో ఉంటుందని  తాజా ఉత్తర్వులో పేర్కోంది. ఉత్తరా ఖండ్ లో అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు తహతహ లాడుతున్న రాజకీయపక్షాలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ఆరంభించాయి. ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది.  ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పక్షాలతో ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరాయి. మరో వారం పది రోజుల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం  ధైర్యంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: