
కానీ మంత్రి పదవులు అందరికీ దక్కడం కష్టం...కొందరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది...అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఆ అదృష్టవంతులు ఎవరు దానిపై పెద్ద చర్చే నడుస్తోంది...ప్రస్తుతం కడప నుంచి ఒక మంత్రి మాత్రమే ఉన్నారు...అంజాద్ బాషా మంత్రివర్గంలో ఉన్నారు..పైగా ఆయనకు డిప్యూటీ సీఎం హోదా కూడా ఉంది. ఇక శ్రీకాంత్ రెడ్డి...చీఫ్ విప్ గా ఉన్నారు.
అయితే ఈ సారి కడపలో మంత్రి అయ్యే అదృష్టం ఎవరికి దక్కుతుందో తెలియడం లేదు...ఎలాగో అంజాద్ బాషా పదవి పోయేలా ఉంది...మరి ఆయన ప్లేస్ లో ఛాన్స్ కొట్టేయడానికి పలువురు నేతలు చూస్తున్నారు...అందులో ముఖ్యంగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పదవి కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు..ప్రస్తుతానికి ఈయన చీఫ్ విప్ గా ఉన్నారు...అటు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సైతం పదవి ఆశిస్తున్నారు...మొదట విడతలోనే ఈయనకు పదవి రావాల్సింది...కానీ జస్ట్ మిస్ అయింది.
ఇటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సైతం మంత్రి రేసులో ఉన్నారు...వీరేగాక మరికొందరు పదవి ఆశిస్తున్నారు...కానీ ఎవరు ఆశించిన కడప జిల్లా నుంచి ఒక్కరికే క్యాబినెట్ లో ఛాన్స్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు...ఎలాగో జగన్ కడప జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి....జిల్లా నుంచి ఒక్కరినే క్యాబినెట్ లోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి కడపలో ఒక్క నేతకే క్యాబినెట్ లో ఛాన్స్ ఉంది.