‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను..ప్రభుత్వ బాధ్యత జనసేన తీసుకుంటుంది’ పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట.


‘జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి అందరు కలిసిరావాలి..ప్రజాఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది’..తునిలో చంద్రబాబు మాట.  ఈ ఇద్దరి మాటలో ఎంతటి సారూప్యత ఉందో అర్ధమవుతోందా ? ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కంకణం కట్టుకున్నారు.


అయితే ఒంటరిగా పోటీచేసి జగన్ను ఓడించేంత సత్తా తమకు లేదని ఇద్దరికీ అర్ధమైపోయింది. అందుకనే ఇద్దరు కూడా అన్నీపార్టీలు కలిసిరావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. రెండుపార్టీలు కూడా విడివిడిగా పోటీచేస్తే ఏమవుతుందో వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. అందుకనే ఒంటరిగా పోటీచేయటానికి ఇద్దరూ  భయపడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళకు ముందు  కలవటానికి ఎందుకో ఇద్దరూ  వెనకాడుతున్నారు.





రెండుపార్టీల మధ్య పొత్తుండాలని ఇద్దరికీ బలమైన కోరికే ఉన్నట్లుంది. కానీ ఆ విషయాన్ని చంద్రబాబునాయుడు బహిరంగంగా వ్యక్తంచేసినట్లు పవన్ చేయటానికి ఎందుకో  వెనకాడుతున్నారు. మిత్రపక్షమైన బీజేపీకి చంద్రబాబుకు మధ్య సయోధ్య చేసి పొత్తు ఫిక్స్ చేయటానికి పవన్ స్ధాయి సరిపోదు. ఎందుకంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయం డిసైడ్ అయ్యేది నరేంద్రమోడి, అమిత్ షా స్ధాయిలో మాత్రమే. మధ్యలో ఎవరెన్ని వేషాలేసినా అవన్నీ పులివేషాలే కానీ వాస్తవం కాదు. అందుకనే పవన్ స్ధాయి సరిపోదన్నది.





ఇదే సమయంలో ఇప్పటికప్పుడు బీజేపీని వదిలేసి చంద్రబాబుతో కలవటానికి పవన్ వెనకాడుతున్నారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్లే తమను పవన్ వదిలేశాడని బీజేపీ అగ్రనేతలకు మండిందంటే ఇద్దరికీ మూడినట్లే అనే భయం ఉన్నట్లుంది. అందుకనే ఇద్దరు తమ ఆలోచనలను ఈ విధంగా బయటపెట్టుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో ఏమోగానీ మొత్తానికి పొత్తులు లేకపోతే జగన్ను ఓడించటం సాధ్యంకాదని ఇటు పవన్ అటు చంద్రబాబు ఇద్దరూ అంగీకిరించినట్లే అనిపిస్తోంది. మరి ఇద్దరు కలిసిన తర్వాతైనా జగన్ను ఓడించటం సాధ్యమేనా ?


 


మరింత సమాచారం తెలుసుకోండి: