జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలను బట్టిచూస్తే పార్టీకి పెద్ద ఫైనాన్షియర్ దొరికినట్లే అనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీని అభ్యర్ధులతో పాటు నిధుల సమస్య కూడా పట్టి పీడిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయాలంటే రెండు ప్రధాన సమస్యలు అవరోధంగా మారుతున్నాయి. మొదటిదేమో అభ్యర్ధుల కొరత. ఇక రెండోదేమో నిధుల కొరత. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా జనసేనకు పెద్ద సమస్యలు ఈ రెండే.





సో ఈ సమస్యలను అధిగమించటంలో భాగంగానే నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకి మద్దతుగా పవన్ మాట్లాడినట్లున్నారు. నరేంద్రమోడీ పాల్గొన్న భీమవరం సభకు ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే సిట్టింగ్ ఎంపీ రఘురాజు పాల్గొనే అవకాశం రానపుడు తానెందుకు వెళ్ళాలన్న కారణంతోనే వెళ్ళలేదనే పనికిమాలిన లాజిక్ వినిపించారు. ఏదేమైనా ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా జనసేన తరపున రఘురాజు పోటీచేయబోతున్నారని.





వచ్చే ఎన్నికలనాటికి రఘురాజు వైసీపీ నుండి బయటకు వచ్చేయటం ఖాయం. మరపుడు ఏ పార్టీలో చేరాలనేది పెద్ద ప్రశ్న. దానికి సమాధానంగా జనసేనలోనే రఘురాజు చేరబోతున్నట్లు గతంలోనే చెప్పుకున్నాం. దానికే ఇపుడు పవన్ మాట్లాడింది మద్దతుగా ఉంది. రఘురాజు జనసేన తరపున పోటీచేస్తే కొంతవరకు నిధుల కొరతతో పాటు అభ్యర్ధుల కొరత కూడా తగ్గే అవకాశముంది. రఘురాజు ఆర్ధికంగా ఎంత బలంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.






బ్యాంకులను మోసగించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీచేసిన కేసులను చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఆర్ధిక పటిష్టత. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోటీచేయాల్సిన అభ్యర్ధుల ఎంపికలో కూడా రఘురాజు కీలకంగా ఉండే అవకాశముంది. అలాగే వాళ్ళందరి ఎన్నికల ఖర్చును కూడా భరించక తప్పదు. రాజుగారు పెద్ద మనసు చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా అభ్యర్ధుల ఖర్చును భరించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. దీంతో కనీసం ఒక జిల్లాలో అభ్యర్ధులు, వాళ్ళ ఖర్చులకు  రఘురాజు రూపంలో పవన్ కు పెద్ద ఫైనాన్షియర్ దొరికినట్లే కదా.  



మరింత సమాచారం తెలుసుకోండి: