జనసేన అధినేత ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడింది.ఆదివారం నాడు జరిగిన జనసేన లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. జనవాణిలో వచ్చిన ఆర్జీలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు.ఈ అధ్యయనం పూర్తైన తర్వాత బస్సు యాత్రని నిర్వహించనున్నట్టుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ప్రజల నుండి వచ్చిన సమస్యలపై అధ్యయనం చేసిన తర్వాతే బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుండి బస్సు యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావించిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించి బస్సును కూడా రెడీ చేస్తున్నారు.రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బస్సు యాత్ర నిర్వహించనున్నారు. జనసేన జనవాణి కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంది. కౌలు రైతుల సమస్యలపై జనసేనాని చేస్తున్న పర్యటనలు ఇంకా కొన్ని జిల్లాల్లో పూర్తి చేుయాల్సి ఉంది. అయితే జనవాణితో పాటు, కౌలు రైతుల సమస్యలపై చేస్తున్న పర్యటనలు పూర్తి చేసిన మీదట బస్సు యాత్ర చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.


అయితే వచ్చే ఏడాది జనవరి నెలలో బస్సు యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. బస్సు యాత్రకు ముందే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ విషయమై రాజకీయ విశ్లేషకులతో పాటు పార్టీలో కొందరు నేతల సూచనల మేరకు బస్సు యాత్రను వాయిదా వేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చారు. లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా వేసిన విషయాన్ని ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చూస్తామని జనసేనాని ప్రకటించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావొద్దని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు గాను తన వంతు ప్రయత్నాలు చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే విపక్ష కూటముల మధ్య పొత్తులుంటాయా అనే విషయమై చర్చ రాష్ట్రంలో సాగుతుంది. అయితే పొత్తుల విషయమై ఇప్పటికే స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: