రైల్వే ఉద్యోగులకు కేంద్రం ప్రబుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. పండగకు పండుగ కు ఉద్యోగుల కు ప్రభుత్వం కానుకలు అందిస్తూ వస్తుంది.. ఇప్పుడు దీపావళికి కూడా సంతోషకరమైన వార్తను చెప్పింది.. నెలకు అందుకుంటున్న జీతంతో పాటు ఇప్పుడు ఎక్స్ట్రా బోనస్ ను కూడా ఇస్తున్నారు. లక్షలాది మంది భారతీయ రైల్వే ఉద్యోగుల కు దీపావళి పండుగ ముందే వచ్చేసింది. వారికి 78 రోజుల బోనస్‌ ను దీపావళి కానుక గా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..


2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే ఉద్యోగులకు 78 రోజులకు సమానమైన బోనస్ చెల్లింపున కు మోదీ క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కాగా, గత ఏడాది కాలం లో ఇండియన్ రైల్వేస్ భారీ ఆదాయాన్ని రాబట్టింది. ఈ క్రమంలో నే ఆర్జించిన లాభాల ఆధారంగా.. అందు లోని కొంత భాగాన్ని ఉద్యోగుల కు బోనస్‌ గా ఇవ్వనుంది... అయితే దాదాపు 11.27 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగుల కు ఈ బోనస్ అందనుంది. 'ఈ బోనస్ చెల్లింపు ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుంది.


రైల్వేస్ మళ్లీ ఆదాయాల బాట పట్టడం లోనే కాకుండా.. రైల్వే ప్రయాణీకుల భద్రత, మెరుగైన సేవలను అందించడంలో సహాయపడిన వారందరిలో నూ ఈ బోనస్ చెల్లింపు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కేంద్రం తెలిపింది.ట్రాక్ మెయింటెయినర్లు, డ్రైవర్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియ న్లు, టెక్నీషియ న్ హెల్పర్లు, కంట్రోలర్లు, పాయింట్‌ మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ 'సి' సిబ్బందితో సహా వివిధ వర్గాల కు పైన పేర్కొన్న బోనస్‌ను చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఇప్పటికే ఎన్నో బోనస్ లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆఫర్ ను ప్రకటించడం తో ఉద్యోగులు సంతోషం గా వున్నారు. ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు..
 

మరింత సమాచారం తెలుసుకోండి: