
నెల్లూరు రురల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యే గా గెలుస్తూ వస్తున్నాడు. తనదైన శైలితో ప్రజల అభివృద్ధి కోసం ఉద్యమాలు నిరసనలు చేస్తూ ప్రజల్లో ఒక పేరును తెచ్చుకున్నాడు. రురల్ లో తన మాటకు కట్టుబడి ఓటు వేసే ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయడు అన్నది తేలిపోయింది, ఇక మిగిలింది టీడీపీ నుండి చేయడమా లేదా స్వతంత్ర అభ్యర్థిగా చేయడమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ కోటంరెడ్డి బరిలో ఉంటే ఖచ్చితంగా ప్రత్యర్థి ఎవరైనప్పటికీ గెలుపు అంత సులభం కాదు. అందుకే నెల్లూరు రురల్ లో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలవడం చాలా అవసరం.
కోటం రెడ్డిని తిప్పికొట్టాలంటే బలమైన నాయకుడిని బరిలోకి దించాలి, ఇప్పటికే రురల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జి గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నియమించాడు. మరి ఆయననే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంచుతాడా ? లేదా మరెవరినైనా రంగంలోకి దించుతాడా అన్నది తెలియాల్సి ఉంది. ఎవ్వరు వైసీపీ నుండి బరిలోకి దిగినా వైసీపీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రం.. ఆ నాయకుడికి మంత్రి పదవి గ్యారంటీ అన్న టాక్ ఇప్పుడు లోకల్ గా వినిపిస్తోంది. మరి ఎవరా అదృష్టవంతుడు అన్నది తెలియాల్సి ఉంది.