ఔను. మీరు క‌రెక్టుగానే చ‌దివారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ రాష్ట్రానికి చెందిన‌ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌కు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్ర‌తీక అయిన రాఖీ పండుగ ఇప్పుడు లేదు క‌దా..ఇప్పుడెందుకు రాఖీ క‌ట్టారు?  స్వీట్లు తినిపించారు? అనే సందేహం మీకు రావ‌చ్చు. దానికి కార‌ణం ఏంటో తెలుసా? అన్న‌గా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌. ప్ర‌జ‌లంద‌రికీ పెద్ద‌న్న‌గా ఉండ‌టం వ‌ల్ల‌. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేబినెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌డం, దాన్ని ఆమోదించి దిశ చట్టం తీసుకురావడం...తెలిసిన సంగ‌తే.

 

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!


మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా(సవరణ) చట్టం -2019(ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌)ను ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని ఏపీ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై రాష్ట్రమంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేప‌థ్యంలోనే...సీఎం జగన్‌ను ఇవాళ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమినిస్టర్‌ సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏఐసీసీ చైర్మన్‌ రోజాతో పాటు మహిళా ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

 

నేను కేటీఆర్ పీఏను...ఓ 90 వేలు అడ్జెస్ట్ చేస్తారా ప్లీజ్‌

 

కాగా, దిశ ఉదంతంపై ‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో ఉద్వేగ‌పూరిత ప్ర‌సంగం చేసిన సంగ‌తి తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  అన్నారు.  రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’  ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి  అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంత‌రం రెండ్రోజుల‌కే...దిశ చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: