ప్రస్తుత కాలంలో సెల్‌ ఫోన్ వాడని వారు ఉండరు కానీ ఫోన్లు వాడటం చాలా ప్రమాదకరంగా మారుతుంది. అలాగే ప్రమాదంతో పాటుగా... సెల్ ఫోన్ లతో చాలా సహాయం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలో ఫోన్ వలన రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఫోన్ రింగ్ టోన్‌ కు రెండు ప్రాణాలు బలైన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్క నిమిషం ఆ ఫోన్ తీయకుండా ఉంటే ప్రయాణం సాఫీగా సాగి ఉండేదేమో !!!.

 

కానీ.. ఓ వ్యక్తి ఫోన్ రింగైందని ఆదరా బాదరాగా ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే ఇద్దరి మరణానికి, రోడ్డు ప్రమాదానికి కారణం అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌ లోనే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

వివరాల్లోకి వెళితే.. గుంటూరు నుంచి తాడికొండ రహదారిలో  ఓ కూలి ఆటో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న కూలీ ఒకరు తన సెల్‌ ఫోన్‌ ను ఆటో హ్యాండిల్ వద్ద పెట్టారు. ఫోన్ సడెన్‌ గా మోగడంతో ఆ కూలీ అక్కడి నుండి ఫోన్‌ ను  తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో కూలీ చేతులు డ్రైవర్ మొఖానికి అడ్డుగా రావడంతో రోడ్డు కనిపించక ఆటో అదుపుతప్పినట్లు తెలుస్తోంది.

 

అదుపు తప్పిన ఆటో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌ లోనే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గుంటూరు జీజీహెచ్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందరూ ఒక గ్రామానికి చెందిన వారేనని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: