ఏపీలో రాజకీయ పార్టీలు కులాల బేస్ మీద నడుస్తాయనే సంగతి తెలిసిందే. ఒక్కో పార్టీలో ఒక్కో కులం హవా ఉంటుంది. అయితే ఇప్పుడు అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగానే ఉంటుంది. కానీ టీడీపీ మాదిరిగా ఒక్క కమ్మ కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లాంటి పనులు జగన్ చేయరు. పార్టీలో అన్నీ వర్గాలకు సమన్యాయం చేస్తారు. ముఖ్యంగా టీడీపీకి ఎక్కువ అండగా ఉండే కమ్మ నేతలు వైసీపీలో కూడా బాగానే ఉన్నారు. వారికి జగన్ అంటే ఎక్కువ అభిమానం కూడా ఉంటుంది. అలా ఉన్నవారికి ఉదాహరణగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీలని చెప్పుకోవచ్చు.

 

అయితే పార్టీలో పదవులు రాకపోయిన కూడా ఆ కమ్మ నేతలు జగన్‌ని మాత్రం వదలరు. అలా ఎలాంటి పదవి లేకపోయిన...జగన్ కోసం నిలబడుతున్న నేతలు వైసీపీలో బాగానే ఉన్నారు. వారిలో ముఖ్యంగా సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరు చెప్పుకోవచ్చు. ఈయన స్వతహాగానే వైఎస్సార్ అభిమాని. ఆయన అండతోనే 2004లో చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009లో కూడా పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు. తర్వాత వైఎస్సార్ మరణంతో జగన్‌తో కలిసి నడిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి చిలకలూరిపేటలో గెలవాలనే ఉద్దేశంతో జగన్ మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి, విడదల రజనికి టికెట్ ఇచ్చారు. అనుకున్న విధంగానే రజని విజయం సాధించారు. కానీ మర్రికి పదవి రాలేదు. పైగా మండలి రద్దు కానుండటంతో ఎమ్మెల్సీ రాదు. అయిన సరే జగన్ ఏదొరకంగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మర్రి పార్టీలో పని చేస్తున్నారు. అలాగే 2014లో పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటరమణ 2019 ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారు. అలా అని ఎలాంటి పదవి లేకపోయిన జగన్‌తో నడుస్తున్నారు. ఇక మొన్న ఎన్నికల్లో జగన్ కోసం గొట్టిపాటి భరత్ పర్చూరు టికెట్ త్యాగం చేశారు. అయితే ఇప్పుడు ఇన్ చార్జ్ పదవి మళ్ళీ ఇచ్చారు. కానీ కీలక పదవి ఏం రాలేదు. అయిన జగన్ కోసం ఏదైనా చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: