వైయస్ జగన్ పక్కా ప్రణాళికలతో రాజకీయాలలో దూసుకుపోతున్నారు. ఎక్కడా కూడా పరిపాలనలో తనకి మరియు ప్రజలకు మధ్య ఎవరు అడ్డు రాకుండా పగడ్బందీ వ్యూహాలతో పరిపాలన చేస్తున్నారు. ముందునుండి తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాటినుండి ఏ ఒక్క రాజకీయ నాయకుడిని నమ్మకుండా ప్రజలనే నమ్ము కుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించి 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి ఫలితాలు రాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చాలామంది జగన్ పార్టీ లో గెలిచిన వాళ్ళు చంద్రబాబు ఆఫర్లకు లొంగిపోయి వెళ్లిపోవడం జరిగింది.

 

దీంతో ఏ సందర్భంలో కూడా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక తన ఆలోచనలు ఏ మాత్రం బయటకు చెప్పకుండా వేసిన స్కెచ్ అమలు చేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని అప్పుడు ప్రజల ముందు తన నిర్ణయాన్ని చెబుతున్నారు. పోలవరం విషయంలోనూ మరియు మూడు రాజధానులు చెప్పటం లోనూ జగన్ వేసిన స్కెచ్ లో సొంత మనుషులే విలవిలలాడి పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా కూడా డబ్బులు పంచ కూడదని మద్యం పంచ కూడదు అని జీవో జారీ చేయడంతో...సొంత పార్టీ మనుషులే జగన్ వేసిన స్కెచ్ కి విలవిలలాడి పోతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి.

 

అంతేకాకుండా ఇటువంటివి చేస్తే జైలు శిక్ష గ్యారెంటీ అని జీవో కూడా తీసుకురావడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీ నాయకులకి షాక్ కొట్టినట్లయింది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏ విధమైన ఫలితాలు రాబడుతోంది అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ముఖ్యంగా సంక్షేమ మరియు అభివృద్ధి బాగా జరగడంతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువగానే రావడంతో వైయస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చాలా ధైర్యంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: