టైం చూసి పొలిటికల్ గేమ్ ప్లే చేయడం లో ఏపీ సీఎం జగన్ తర్వాతే ఎవరైనా. వయసులో చిన్నవాడైనా ఈ మధ్య రాజకీయ వ్యూహాలు వేయడంలో పరిణితి చెందినట్టుగా సిద్ధహస్తుడు గా కనిపిస్తున్నారు. జగన్ పై కేసులు ఉన్నాయి..?, జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి..?, కేంద్రాన్ని చూసి భయపడుతున్నారు. మోడీకి ఎప్పటికైనా సరెండర్ అయిపోతాడు అని ప్రతిరోజు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇటీవల వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో కూడా ఇదే ప్రచారం జరిగింది. గతంలో ఇలాంటి వ్యాఖ్యలే వచ్చిన సందర్భంలో ఏనుగు వెళ్ళేముందు కుక్కలు మొరుగుతాయి వాటిని పట్టించుకోనవసరం లేదని జగన్ రిప్లై ఇవ్వడం జరిగింది. తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఇదే నా సందేశం అని జగన్ ఇవ్వటం జరిగింది.

 

ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారు. టిడిపి ఆరోపణలను లైట్ తీసుకోవడమే కాదు… బీజేపీకి తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైసీపీ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. మూడు నెలలు తర్వాత ఢిల్లీ ఎన్నికలలో ఘోర పరాభవం పొందిన తరువాత ఏపీ సీఎం జగన్ కి ప్రధాని మోడీ అకస్మాత్తుగా అపాయింట్మెంట్ ఇవ్వటం సంచలనంగా మారింది. వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యాయ శాఖ మంత్రి  రవి శంకర్ ప్రసాద్ కూడా జగన్ ని పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చారు.

 

జగన్ క్రేజ్ ఈ అపాయింట్మెంట్ లతో దేశమంతటా మారు మ్రోగి పోతోంది. బీజేపీ భవిష్యత్ అవసరాల కోసం జగన్ తో రాజకీయ ఒప్పందానికి అడుగులు వేస్తోందని రాజకీయంలో ఉన్న సీనియర్లకు అర్థమవుతోంది. ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత దేశంలో మిగతా రాష్ట్రాలలో 80% రాష్ట్రాలలో బిజెపి యేతర పార్టీల ప్రభుత్వాలే ఉండబోతున్నాయి. అలా జరిగితే తక్షణమే రాజ్యసభలోనూ 2024 సాధారణ ఎన్నికలలోనూ బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదు. దీంతో ఇప్పటి నుండే మిత్రులను వెతికే పని పెట్టుకున్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి తో ప్రారంభించారు. ఢిల్లీకి ప్రధాని మోడీ పిలిచి దాదాపు గంటసేపు జగన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ షా 40 నిమిషాల పాటు జగన్ తో భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా రెండు సమావేశాల్లోనూ రాష్ట్ర సమస్యల గురించి జగన్ చర్చించారు.

 

అయితే ఇదే సందర్భంలో ప్రధాని మోడీ జగన్ దగ్గర ఒక ప్రతిపాదన తీసుకు వచ్చినట్లు ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఎప్పటినుండో ఎన్డీయేతో పనిచేయాలని జగన్ ని కోరిన మోడీ… ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా మళ్లీ కోరడం జరిగిందని సమాచారం. దీనికి జగన్మోహన్ రెడ్డి కచ్చితమైన అభిప్రాయాని చెప్పి బీజేపీని ఆశ్చర్యపరిచాడు అని టాక్. ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరమని దాని కోసం ఐదు సంవత్సరాలు నేను పోరాటం చేశాని అని మోడీకి గుర్తు చేశారు. మాకు కేంద్రంలో మంత్రి పదవులు కంటే కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా  ముఖ్యమని స్పష్టం చేశారట.

 

ప్రత్యేక హోదా ఇస్తే ఎన్డీఏ లో చేరటానికి ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారట జగన్. నేను చంద్రబాబు లాంటి వాడిని కాదని మంత్రి పదవుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేనని కుండబద్దలు కొట్టి మోడీ కి రిప్లై ఇచ్చారట వైయస్ జగన్. స్పెషల్ స్టేటస్ ఇస్తే కేంద్రంలో చేరిన చేరకపోయినా సహకారాన్ని అందిస్తామని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారట. ఈ సమాధానం విని ప్రధాని మోడీయే ఆశ్చర్యపోయారట. ఇంత కమిట్మెంట్ తో వండడం గ్రేట్ అంటూ వైసిపి నాయకులు చెబుతున్నారు. ఇదే ప్రస్తావన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తీసుకురావడంతో సేమ్ రిప్లై జగన్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: