అదేంటో జగన్ హీరో కదా. ఆయన కేవలం ఏడాది ముందే  కదా బంపర్ మెజారిటీ సాధించి 51 శాతం ఓట్లతో ముఖ్యమంత్రి గద్దెని ఎక్కింది. ఇక జనంలో పదేళ్ళుగా ఉంటూ అసలు సిసలు ప్రజానేతగా ఎదిగారు. ఇంకా చెప్పాలంటే దేశంలోనే రికార్డు స్రుష్టించిన రాజకీయ నేతగా ఉన్నారు.

 

మరి జగన్ కాక హీరో ఇంకెవరు అన్నది ప్రశ్న వస్తుంది. అయితే కరోనా కట్టడి విషయంలో ఇపుడు దేశంలో ముఖ్యమంత్రుల మధ్య తెలియని పోటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రలా మధ్యన విపరీతమైన పోటీ వచ్చింది.ఈ విషయం తీసుకుంటే మాత్రం అందరి చూపూ కేసీయార్ మీదకే వెళ్తోంది. 

 

ఆయన నాయకుడిగా జనం ముందుకు వస్తున్నారు. ప్రెస్ మీట్లో హుషారుగా  మాట్లాడుతున్నారు. తరచూ అధికారులతో సమావేశం, మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నారు. ఓ విధంగా దూకుడునే కేసీయార్ ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా కరోనా కేసుల కట్టడికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ మీడియాని పెద్దగా ఫేస్ చేయకపోవడంతో పాటు మొదట్లో కరోనా వైరస్ మీద చేసిన కొన్ని తేలికపాటి కామెంట్స్ ఆయనకు నెగిటివ్ అయ్యాయి.

 

అదే సమయంలో చంద్రబాబు మార్క్ హంగూ ఆర్భాటానికి అలవాటు పడిన జనాలకు జగన్ తెర వెనక ఎంత ప్రిప్రేర్ గా ఉంటున్నా కూడా ఆయన యాక్షన్ తెర మీద కనిపించలేదన్న అసంత్రుప్తి ఉంది. ఇక కరోనా వైరస్ విషయంలో జగన్ వాస్తవవాదిగా ఉన్నారు. నిజానికి ఇది ప్రాణాంతక వైరస్, కానీ వైరసులు అన్నవి వచ్చిన తరువాత అవి నిరంతర ప్రక్రియగానే కొనసాగుతాయి. వాటిని మందు కనిపెట్టేంతవరకూ అవి ప్రమాదమే. దానికి డెడ్ లైన్ పెట్టేసి ఈ రోజుతో జీరో లెవెల్లోకి వస్తాయని చెప్పలేరు. ఇది వైద్య నిపుణులు కూడా అంగీకరించే విషయం

 

దీనికి లాక్ డౌన్ల వంటివి మొదట్లో జనాలకు అవగాహన కలిగించేందుకు పెట్టినా కూడా అదే చివరిదాకా  మందు కాదు. అందువల్లనే జగన్ లాక్ డౌన్ విషయంలో సడలింపు కోరి వాస్తవవాదిగా సమాజం జీవిత చక్రం ముందుకు కదలాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మిగిలిన వారి జనాల సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి హడావుడి చేస్తున్నారు.

 


 మొత్తం మీద చూసుకుంటే జగన్ చేసినది జనాలకు తెలియక, తెలిసినా అర్ధం కాక కరోనా వైరస్ కట్టడి ఆపరేషన్లో ఆయన వెనకబడిపోయారు. కేసీయార్ మాత్రం అసలైన రాజకీయ నేతగా లౌక్యంతో చాకచక్యంతో ముందుకు సాగుతున్నారు. సో ఇప్పటికైతే రెండు రాష్ట్రాలలో కేసీయారే హీరోగా ఉన్నారన్నది ఒప్పుకోవాల్సిన నిజం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: