ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఆడిన డ్రామాలకు కాలం చెల్లిందని వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ విషయంలో...ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం బట్టి చూస్తుంటే ఇదంతా తెలుగుదేశం పార్టీలోనే కుట్ర జరిగినట్లు ప్రతి ఒక్కరికి అర్థమైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు రాకుండా ఎన్నికలను ఆపేయడం నిమ్మగడ్డ మరియు టిడిపి యొక్క గేమ్ ప్లాన్ అని ఇప్పుడు అందరికీ అర్థమై పోయినట్లే అని చంద్రబాబుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

అయితే నిమ్మగడ్డ పేరిట వచ్చిన లెటర్ విషయంలో జరిగిన ఫోర్జరీ సంతకం తెలుగుదేశం పార్టీ ఆఫీసు లోనే తయారైందని తమ దగ్గర పక్కా సమాచారం ఉందని విజయసాయిరెడ్డి ఆరోపిస్తూ ఈ లెటర్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి విచారణ చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కి తాజాగా తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ పోర్జరీలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, వర్ల రామయ్య, టీడీ జనార్థన్‌ల హస్తం ఉందని విజయ సాయి రెడ్డి ఆరోపించారు.

 

వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేశ్‌ కుమార్ కు తెలిసే జరిగిందని అన్నారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ నిమ్మగడ్డ రాసిన లెటర్ పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒకవేళ రాష్ట్ర హోంశాఖ జరిపే విచారణలో నేరం రుజువైతే టిడిపి పై భారీ కేసు నమోదయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: