మీరు చదివింది కరెక్టే. ఎందుకంటే ఇపుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్  అని కదా అమలు చేస్తున్నారు. ఇదేదో తప్పుగా రాశారు అనుకోకండి. ఇది కూడా కరెక్టే. ఇంకా చెప్పాలంటే ఇప్పటికి ఇదే కరెక్టే.

 

లాక్ డౌన్ వేళ ఊసుపోని తమ్ముళ్ళకు చంద్రబాబు ఇచ్చిన బిగ్ టాస్క్ ఇది. తమ్ముళ్లు ఇంట్లోనే ఉంటూ రొటీన్ పాలిటిక్స్ ని కొనసాగించడం ఎలా అన్న దాని మీద‌ ఎప్పటికపుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాబు ట్రైనింగ్ ఇస్తున్నారు. దాన్ని అమలు చేస్తూ తమ్ముళ్ళు చెలరేగిపోతున్నారు.

 

లాక్ డౌన్ అయినా మా   రాజకీయం మూత పడుతుందా. నెవర్ అంటూ తొడ కొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ పాలిటిక్స్ ఫ్రమ్ హోమ్  అంటే ఏంటో చూడాలంటే విశాఖకు రావాల్సిందే. . విశాఖలో ఉన్న ఇద్దరు టీడీపీ తమ్ముళ్ళు ఇంట్లో ఉండే ఆందోళన చేస్తున్నారు.

 

అదేంటీ అంటే కరోనా వైరస్ వల్ల బాధితులుగా ఉన్న వారిని వైసీపీ సర్కార్ పట్టించుకోవడంలేదుట. అదే విధంగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను అసలు ఆదుకోవడంలేదుట.

 

 

దాంతో వారికి న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు తన ఇంట్లోనే ఉంటూ ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకూ ఈ దీక్ష సాగింది. ఇదేదో బాగుందని మరో తమ్ముడు కూడా దీక్ష చేపట్టాడు.

 

ఆయన గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఆయన తన ఇంట్లో నుంచి ఒక్ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఇదే బాటలో మరెంతమంది వెళ్తారో తెలియదు కానీ పైసా ఖర్చు లేకుండా, ఆర్భాటాలు అంతకంటే లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరిగా తమ్ముళ్ళకు బాబు నేర్పిస్తున్న ఈ సరికొత్త పాఠాలను చూసిన వారు మాత్రం తమ్ముళ్ళకు కరోనా వచ్చినా కూడా ఈ పొలిటికల్ వైరస్ బుర్రలో నుంచి పోదా అని సెటైర్లు వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: