భారత దేశంలో నానాటికీ వరుసగా మోసాలు పెరుగుతూనే ఉన్నాయ్. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా దాదాపు వెయ్యి కోట్లతో ఐడిబి బ్యాంక్ కు పంగనామం పెట్టి పారిపోయిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం ఈ విషయమై విజయ మాల్యాను అప్పగించే అభ్యర్థనను హోమ్ కార్యదర్శి ధృవీకరించారు. అరెస్ట్ మరియు బెయిల్ కు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.  2017 లో మాల్యా పాస్పోర్ట్ రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయ్ మాల్యా  బ్రిటన్ పౌరసత్వాన్ని పొంది అక్కడే స్థిరపడి పోయాడు.

 

కానీ భారత్ మాల్యాను  ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి అనుగుణంగా మాల్యా వ్యతిరేక పిటీషన్లు వేస్తూ నే ఉన్నాడు మరియు సక్సెస్ అయ్యాడు. ఈసారి మటుకు బాబు  గారి పప్పులు  ఉడక లేదు. ఇండియా కి పంపించడానికి మాల్యా వేసిన పిటిషన్ ఇంగ్లాండ్ మరియు వేల్స్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా మాల్యా తన ట్విట్టర్ లో' హైకోర్టు నిర్ణయంతో నేను సహజంగానే నిరాశ చెందాను. నా న్యాయవాదులు సలహా ఇచ్చినట్లు నేను మరింత చట్టపరమైన పరిష్కారాల కోసం ప్రయత్నిస్తాను. 9 వేల కోట్ల రూపాయల మోసం కేసులో నేను భారతదేశంలో విచారణ ఎదుర్కోవలసి ఉంటుందని మీడియాలో వచ్చిన కథనంతో నేను చాలా నిరాశ  పడ్డాను'... అని విజయ్ మాల్యా తన ట్విట్టర్ లో సందేశాన్ని ఉంచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: