ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1100 దాటి 1200కు దగ్గరలో ఉన్నాయి. అయితే ఇలా కరోనా కేసులు పెరగడంతో టీడీపీ నేతలు, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇది కేవలం జగన్ ప్రభుత్వ వైఫల్యమే అని, కరోనా కట్టడి చేయడంతో పూర్తిగా ఫెయిల్ అయిందని మండిపడుతున్నారు. ఇక దీనికి అధికార వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. సీఎం జగన్ కరోనా కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు.

 

అయితే మిగతా సమస్యలపైన ఎలాంటి విమర్సలు చేసిన వైసీపీ నేతలు ఏదొరకంగా టీడీపీకి చెక్ పెట్టగలుగుతున్నారని గానీ, కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీడీపీపై సంచలన ఆరోపణ చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఏదీ అతీతం కాదని,  కరోనా వైరస్ వ్యాప్తికి టీడీపీ స్లీపర్‌సెల్స్‌ను పంపిందేమో అంటూ మాట్లాడారు. కరోనా వ్యాప్తిలో టీడీపీ కుట్రదాగి ఉందని ఆరోపించారు.

 

ఇక మంత్రి వ్యాఖ్యలకు టీడీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. కరోనా కట్టడి చేయడంలో విఫలమై,ఏం చేయాలో తోచక ఇలాంటి ఆరోపణలని చేస్తున్నారని అంటున్నారు. అసలు కరోనా పెరగడానికి వైసీపీ నేతలు విచ్చలవిడిగా తిరగడమే కారణమన్న సంగతి ప్రజలందరికీ తెలుసని, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కరోనాని వ్యాపింప చేస్తున్నారని చెబుతున్నారు.

 

అసలు టీడీపీ వాళ్ళు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారంటే, ఎక్కడన్నా కరోనా తెచ్చుకుని వారు వ్యాపింప చేయాలని అనుకుంటారని ప్రశ్నిస్తున్నారు.  కరోనా కేసులు కంట్రోల్ చేయలేక ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజలు కూడా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని గుర్తించారని, ఇక దాన్ని కవర్ చేసుకునేందుకు వేరే దారి లేక ఆ నెపం టీడీపీ తోసేసి తప్పించుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదని, ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ప్రజల దృష్టిలో నెగిటివ్ అయిపోయిందని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: