రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారా స్థాయిలో ఉంది. వైసిపి పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు తగ్గటం లేదు. న్యాయపరంగా నీటిని తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతున్న మరో పక్క ఇది అన్యాయమని టిఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తోంది. ముందు నుండి ఈ విషయంలో సరైన క్లారిటీ లేకపోవడంతో రెండు ప్రభుత్వాలు న్యాయ స్థానాలకు వెళ్ళటానికి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎక్కువగా జగన్ కంటే కే‌సి‌ఆర్ కే  భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే మామూలుగా ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కే‌సి‌ఆర్ వల్ల విడిపోయిందని ఏపీ ప్రజలు బలంగా నమ్మటం అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి సమయంలో అటువంటి కే‌సి‌ఆర్ జగన్ నీ విమర్శించడం వల్ల జగన్ కి ఎక్కువ పొలిటికల్ మైలేజ్ ఏపీ ప్రజల్లో దక్కుతుందని టాక్. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బిజెపి కూడా కే‌సి‌ఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎప్పటినుండో జాతీయస్థాయిలో రాణించాలని అనుకుంటున్న కే‌సి‌ఆర్.. గత సార్వత్రిక ఎన్నికల టైంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కి దాదాపు రెడీ అయ్యారు. అయితే మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ఇదిలావుంటే ఇటీవల మోడీపై భయంకరమైన విమర్శలు కొద్దికొద్దిగా చేస్తున్నారు.

 

వీటన్నిటిని గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల జగడం లో ఏపీకి మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరిస్తే కే‌సి‌ఆర్ కి పొలిటికల్ గా ఢిల్లీ నుండి గల్లీ దాక దెబ్బ తగిలినట్లే అని … కాబట్టి ఈ విషయంలో జగన్ చాలా సేఫ్ జోన్ లోనే ఉన్నాడని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ఎక్కువగా తెలంగాణ రాజకీయాలను శాసించేది.... రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఈ విధంగా చూసుకున్నా టిఆర్ఎస్ పార్టీకి ఈ గొడవ వల్ల పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్న టాక్ బలంగా నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: