కేరళలో జరిగిన ఏనుగు మృతి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయంలో తెలిసిందే. ఒక పైనాపిల్లో బాంబులు పెట్టి ఏనుగు కు  ఇవ్వడంతో అది తిన్న  ఏనుగు  ఒక్కసారిగా బాంబులు పేలడంతో తీవ్రంగా గాయపడి ఆ ప్రాంతం మొత్తం పరుగులు పెట్టి చివరికి ఒక నది లోకి వెళ్లి ప్రాణాలు విడిచింది. ఒక ఏనుగు చనిపోవడమే ఎంతో మందిని కలిచి వేసింది. ఇక ఆ ఏనుగు  గర్భంతో ఉండడం మరింత మంది హృదయాలను ద్రవింప చేసింది. అయితే ఏనుగు మృతి ఘటనలో అటు అధికారులు కూడా విచారణ ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసులో  అనుమానితులను కూడా అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీస్ అధికారులు. ఏనుగు మృతి ఘటనలో  రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. 

 


 సదరు ఏనుగుని బాంబులు పెట్టి చంపింది ఒక మైనారిటీ కి సంబంధించిన వ్యక్తి అని తేలడంతో ఏనుగుకు ఏం  కాలేదు బాంబులు పేల్చడం ద్వారా మరణించలేదు అని ఒక ప్రొజెక్షన్ మొదలుపెట్టారు. వాస్తవానికి అయితే అక్కడున్న ప్రజలు కూడా ఈ ఏనుగును చంపడానికి ప్రత్యేకంగా బాంబులు పెట్టలేదు. ఏనుగులు ఎలుగుబంట్లు లాంటివి వస్తాయని...  వాటిని పెద్ద పెద్ద సౌండ్తో బెదిరించడానికి అక్కడ పైనాపిల్లో బాంబులు పెట్టి అక్కడ పెడతారు  అక్కడ చాలామంది ప్రజలు. అక్కడి ప్రజలంతా ఇలాంటిదే   చేస్తారు అని అన్నటువంటిది ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న బలమైన వాదన.. 

 


 అయితే ఇది కవర్ చేయడానికి అక్కడ కేరళ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు అంటూ కొంతమంది ప్రస్తుతం పలు విమర్శలకు చేస్తున్నారు . ఇక తాజాగా ఏనుగు మృతదేహానికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక రాగా అందులో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఏనుగు నోట్లు పేలుడు  సంబంధించి ఏనుగు కు తీవ్ర గాయాలయ్యాయి దవడ మొత్తం పగిలి పేలుడు  లోపలి వరకు వెళ్ళింది, దవడలు గొంతు గుండె బలం కూడా ఈ బాంబు పేలుడు వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి.  ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేకపోవడంతో ఇన్ఫెక్షన్ సోకి.. విపరీతమైన నొప్పి రావడంతో... నొప్పితో బాధ పడుతూ  నోరు  ఆహారం లాంటి తీసుకోలేకపోయింది.దీంతో ఆ ఏనుగు  రెండు వారాల పాటు తిండి నీళ్లు లేకుండా గడిపింది. ఇక ఆ తర్వాత నీరసానికి గురై ఆకలి తట్టుకోలేక పెద్దమొత్తంలో నీళ్లు తాగేసింది . దీంతో ఊపిరితిత్తులు పాడైపోయే ప్రాణాలు వదిలింది  అని తాజాగా పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెల్లడయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: