తెలంగాణ లో గత 24 గంటల్లో 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 5 వేల 193కి చేరింది. వైరస్ తగ్గి 2766 మంది డిశ్చార్జి కాగా.. 2240 మందికి చికిత్స అందిస్తున్నారు. సోమవారం కూడా వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 187కి చేరింది. అయితే ఇప్పుడు నమోదు అయిన కేసుల్లో 189 కేసులు బల్దియా పరిధిలోనే వెలుగుచూడడం గమనార్హం.

 

ఇదిలా ఉండగా కేసీఆర్ గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ప్రగతి భవన్ లో కరోనా భయం లేకుండా కొనసాగుతున్న మీటింగ్స్ వల్ల ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలవరం మొదలైంది. ఇప్పతికే ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.

 

అయితే వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ కు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా వ్యవహరించే గంగాధర్ కు ఇటీవల నిర్వహించిన నిర్దారణ పరీక్ష ఫలితం ఆదివారం సాయంత్రం వచ్చింది. అదికాస్తా పాజిటివ్ కావటంతో ఒక్కసారంతా ఉలిక్కిపడిన పరిస్థితిఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న అంచనా లేదో ఏమో కానీ..సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ కు ఈటెల కూడా హాజరయ్యారు.

 

మంత్రి ఓఎస్డీ కి కోవిడ్ పాజిటివ్ అయినప్పుడు.. మంత్రి ఈటెలకు ముప్పు అవకాశాలు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. ఎందుకుంటే ఈటెలతోనే గంగాధర్ కరోనా నిర్థారణ కాని ముందు రెండు రోజులు ఉన్నాడు. కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి వరుసబెట్టి నిర్వహించిన రివ్యూ మీటింగ్, ఇతరత్రా సమావేశాలు చాలా రిస్క తో కూడుకున్నవి అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఇలాంటి రిస్కులకు కాస్త దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: