రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు సుజనా చౌదరిపై బిజెపి అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సుజనా చౌదరి, బిజెపి నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు రహస్యంగా భేటీ అవ్వడం, సుమారు రెండు, మూడు గంటల పాటు వారు మాట్లాడుకున్న వ్యవహారం సీసీ టీవీ పుటేజ్ ద్వారా మీడియాలో ప్రసారం అవ్వడం వంటి సంఘటనలు కలకలం రేపాయి. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు ఈ ఇద్దరూ బిజెపికి చెందిన వారైనా, చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులుగా ముద్రపడ్డారు. అది కాకుండా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై వైసిపి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్న సమయంలో, ఈ వ్యవహారం కోర్టులో లో ఉన్న ఈ పరిస్థితుల్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ఈ ముగ్గురూ భేటీ అవడం పై రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో పాటు, బీజేపీ కూడా విమర్శలు ఎదుర్కొంది.


 దీంతో ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ సుజనా చౌదరి వివరణ కోరినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ అయి బిజెపి పరువు తీశారని కొంతమంది రాష్ట్ర బిజెపి నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వివరణ సుజనా , కామినేని వివరణ కోరినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వైసీపీతో బిజెపికి రాజకీయ అవసరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏంటని బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.


 అందుకే సుజనాచౌదరి తోపాటు, కామినేని శ్రీనివాస్ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి వారిని వివరణ కోరాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, బీజేపీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడబోమనే విధంగా ఆ పార్టీ సంకేతాలు ఇస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: