ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకి దాదాపు 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్న వైరస్ కంట్రోల్ అయినా సందర్భాలు ఎక్కడా కనబడలేదు. ఎన్ని లాక్ డౌన్ లు కఠినంగా అమలు చేసిన కరోనా కంట్రోల్ అవకపోవడం తో కేంద్రంలో టెన్షన్  స్టార్ట్ అయింది. ముఖ్యంగా  ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించకపోవడం వల్లే కరోనా దేశంలో ఉదృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెప్పుకొస్తున్నారు. దేశంలో ఎక్కువుగా కరోనా ప్రభావం రాజధాని ఢిల్లీలో  ఉండటంతో... భయంకరంగా కొత్త పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వైరస్ ని కట్టడి చేయడం కోసం ప్లాస్మా థెరఫి బ్యాంకు ఏర్పాటు చేయటానికి రెడీ అయ్యారు.

 

ఈ సందర్బంగా రెండు రోజుల్లో ప్లాస్మా థెరఫి బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ నుండి కోలుకున్న రోగులు ఇతర ప్రజల ప్రాణాలను కాపాడటానికి మానవత్వంతో పెద్ద మనసు చేసుకుని ముందుకు రావాలని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా థెరఫి విధానాన్ని ఇప్పటివరకు 29 మందిపై నిర్వహించామని అద్భుతమైన ఫలితాలు రావడం జరిగాయని తెలిపారు. సౌత్ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ వద్ద ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయబోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

 

ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఎవరికి ఉండదని...అంతేకాకుండా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం అన్ని విధాలా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారాలు అందించడానికి ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: