తెలంగాణలో ధర్మపురి అరవింద్ కి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ దసరా తర్వాత జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు అనే దానిపై ఇపుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా కసరత్తు చేశారని అంటున్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా ఇప్పుడు మార్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న మంత్రులు మొత్తాన్ని మార్చేసి కొత్త టీం ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఆర్థిక శాఖ లోకి ధర్మపురి అరవింద్ ని కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన సాధారణంగా విద్యావంతుడు కావడంతో ఆ శాఖలోకి ఆయనను తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంకుకి పనిచేసిన మాజీ గవర్నర్ ఒక ఆయనను కూడా కేంద్ర ఆర్థిక శాఖ లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్థిక రంగాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అనేది కేంద్ర ప్రభుత్వం పై చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కేంద్రం ఆర్థికంగా నిలబడక పోతే భవిష్యత్తులో ప్రజలపై భారం తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయి. తలకు మించిన అప్పులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఆర్థిక శాఖ అనేది చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే సమర్థవంతమైన వ్యక్తులను ఆర్థిక శాఖలో తీసుకుంటే బాగుంటుంది అనే భావన ప్రధాని నరేంద్ర మోడీ లో కూడా ఉంది. ఇప్పటికీ పలువురి పేర్లను పరిశీలించిన సరే చాలా మంది సమర్థులు కాదు అనే అభిప్రాయానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: